తెలుగులో డబ్బింగ్ చెప్పిన న్యూజిలాండ్ బ్యూటీ!

  • నాగశౌర్య హీరోగా 'కృష్ణ వ్రింద విహారి'
  • కథానాయికగా షెర్లీ సెటియా పరిచయం
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
  • ఈ నెల 23వ తేదీన సినిమా రిలీజ్  
తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో అందమైన కథానాయికలు వరుసగా పరిచయమవుతూ వస్తున్నారు. సాధారణంగా టాలీవుడ్ కి వచ్చే హీరోయిన్స్ బాలీవుడ్ నుంచి గానీ కోలీవుడ్ నుంచి గాని ఉంటారు. ఇక కేరళ నుంచి దిగిపోయే భామల సంఖ్య కూడా ఎక్కువనే. కానీ ఈ సారి 'కృష్ణ వ్రింద విహారి' సినిమా కోసం ఏకంగా న్యూజిలాండ్ భామనే రంగంలోకి దింపారు .. ఆమె పేరే షెర్లీ సెటియా. 
 
నాగశౌర్య హీరోగా దర్శకుడు అనీష్ కృష్ణ  రూపొందించిన 'కృష్ణ వ్రింద విహారి' సినిమా ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐరా క్రియేషన్స్ బ్యానర్  పై నిర్మితమైన ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాను గురించి అనీష్ కృష్ణ మాట్లాడుతూ షెర్లీ సెటియా గురించి ప్రస్తావించాడు. 

టాలీవుడ్ కి పక్క రాష్ట్రాల నుంచి హీరోయిన్స్ ఎక్కువగా వస్తుంటారు. అలాంటివారితో డైలాగ్స్ చెప్పించడమే చాలా కష్టం. కానీ షెర్లీ న్యూజిలాండ్ కి చెందిన అమ్మాయి .. ఆమెకి హిందీ కూడా రాదు. కానీ ఆమె తెలుగు నేర్చుకుంది .. డైలాగ్స్ చెప్పింది.  ఇంకో విశేషం ఏమిటంటే ఈ సినిమాలో తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకుంది. ఇది ఆమె అంకితభావానికి నిదర్శనం" అని చెప్పుకొచ్చాడు.


More Telugu News