ఐఏఎస్ అధికారినని నమ్మించి.. 8 మందిని పెళ్లాడి కోట్లలో మోసం చేసిన హిజ్రా!
- మోసపోయిన వారిలో పలువురు పోలీసులు, పారిశ్రామికవేత్తలు
- పెళ్లి తర్వాత కోట్లలో డబ్బు, నగలతో పరారీ
- తిరుచ్చి ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు
తమిళనాడుకు చెందిన ఓ హిజ్రా ఐఏఎస్‌నని నమ్మిస్తూ 8 మందిని పెళ్లాడి ఆపై కోట్లలో నగదు, నగలు కాజేసి పరారైంది. ఆమె చేతిలో మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుచ్చికి చెందిన బబితా రోజ్ అనే ట్రాన్స్‌జెండర్ తాను ఐఏఎస్ అధికారినంటూ ప్రచారం చేసుకుంది. గొప్పగొప్ప వాళ్లతో తనకు పరిచయాలు ఉన్నాయని చెప్పుకుంది.
ఈ క్రమంలో ప్రేమిస్తున్నానంటూ 15 మందిని నమ్మించింది. ఆపై తిరుచ్చి, కడలూరు, కళ్లకుర్చి, కోయంబత్తూర్, మడత్తుకుళం, తిరుప్పూర్, విరుదునగర్, రాజపాళయం, నాగర్‌కోయిల్ తదితర ప్రాంతాలకు చెందిన 8 మందిని వివాహం చేసుకుంది. వీరిలో పలువురు పారిశ్రామికవేత్తలు, పోలీసు అధికారులు కూడా ఉండడం గమనార్హం.
పెళ్లి చేసుకున్నాక నగదు, బంగారు ఆభరణాలు, కాజేసి పరారయ్యేది. ఆమె చేతిలో మోసపోయిన బాధితులు తాజాగా తిరుచ్చి ఎస్పీ సుజిత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. హిజ్రా బబితా రోజ్‌ను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బబిత కోసం గాలిస్తున్నారు.