సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్లాలి: అనిల్ రావిపూడి

  • ఈ నెల 23న రిలీజ్ కానున్న 'కృష్ణ వ్రింద విహారి'
  • ఊపందుకున్న ప్రమోషన్స్ 
  • అనిల్ రావిపూడి చీఫ్ గెస్టుగా జరిగిన ఈవెంట్ 
  • సంగీత దర్శకుడిగా మహతి స్వర సాగర్
నాగశౌర్య - షిర్లే సెటియా జంటగా నటించిన 'కృష్ణ వ్రింద విహారి' సినిమాకి అనీష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. సొంత బ్యానర్ పై నాగశౌర్య నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 23వ తేదీన థియేటర్స్ కి తీసుకుని వస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ," ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం చాలా ఆనదంగా ఉంది. ఈ టీమ్ అంతా కూడా నాకు ఒక ఫ్యామిలీ లాంటింది. అందరూ  కూడా ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు. 

అనీష్ ఎప్పుడు చూసినా సరదాగా నవ్వుతూనే ఉంటాడు. నాకు ఆయనలో నచ్చేది అదే. ఈ సినిమాతో ఆయనకి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అనీష్ లో మాత్రమే కాదు .. నిర్మాతలలోను అదే ఆనందం .. ఆత్మీయత కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రొడక్షన్ లో ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. నాగశౌర్య విషయానికి వస్తే ఎప్పటికప్పుడు జోనర్స్ మారుస్తూ వెళుతున్నాడు. ఆయనలోని కష్టపడే తత్వం నాకు బాగా నచ్చుతుంది. ఆయన కెరియర్లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని భావిస్తున్నాను. 

ఈ తరహా సినిమాలు నాగశౌర్యకి బాగా సెట్ అవుతాయి. ఇలాంటి సినిమాలు ఆయన చేయడం వలన తప్పకుండా మరిన్ని హిట్లు కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. సినిమాను జనంలోకి తీసుకుని వెళ్లడం కోసం ఎంత దూరమైనా వెళ్లాలి. శౌర్య అదే పని చేశాడు. అందుకు నేను ఆయనను అభినందిస్తున్నాను. విజయోస్తూ -  దిగ్విజయోస్తూ అంటూ ఆశీర్వదిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.      
    



More Telugu News