ఏపీలో అన్ని ఆలయాల్లో తిరుమల తరహా ఆన్ లైన్ వ్యవస్థ: మంత్రి సత్యనారాయణ

  • ఆన్ లైన్ సేవల కోసం ప్రత్యేక వెబ్ సైట్
  • శ్రీశైలంలో ప్రయోగాత్మక పరిశీలన
  • పారదర్శకత కోసమే ఆన్ లైన్ వ్యవస్థ అన్న మంత్రి
ఏపీలో అన్ని ఆలయాల్లో ఇకపై తిరుమల తరహా ఆన్ లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. ఆన్ లైన్ సేవల కోసం aptemples.gov.in పేరిట వెబ్ సైట్ ఏర్పాటు చేశామని చెప్పారు. 

ఇప్పటికే శ్రీశైలం దేవస్థానంలో వెబ్ సైట్ సేవలు ప్రయోగాత్మకంగా పరిశీలించామని మంత్రి తెలిపారు. దశల వారీగా అన్ని ఆలయాలకు ఆన్ లైన్ విధానం వర్తింపజేస్తామని చెప్పారు. అవినీతి లేని పారదర్శక విధానాల కోసమే ఆన్ లైన్ వ్యవస్థను తీసుకువస్తున్నామని వివరించారు. దర్శనాల స్లాట్ బుకింగ్ లు, వసతి, కానుకల సమర్పణ అన్నీ ఆన్ లైన్ చేస్తున్నామని వెల్లడించారు. 

అంతేకాకుండా, ఆలయ భూములు, ఆస్తులు, ఆభరణాల వివరాలను డిజిటలైజ్ చేస్తున్నామని చెప్పారు.


More Telugu News