మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలంటూ తెలంగాణ గవర్నర్‌కు అజారుద్దీన్ ఆహ్వానం
- ఉప్పల్‌లో టీమిండియాతో 25న ఆస్ట్రేలియా మ్యాచ్
- హెచ్‌సీఏ అధ్యక్షుడి హోదాలో ఆహ్వానించిన వైనం
- ట్విట్టర్లో ఈ విషయాన్ని పంచుకున్న గవర్నర్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు సోమవారం ఓ అరుదైన ఆహ్వానం అందింది. ఈ నెల 25న నగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలంటూ ఆ ఆహ్వానం అందింది. టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ స్వయంగా ఈ ఆహ్వానాన్ని ఆమెకు అందించారు.
తనకు అందిన ఆహ్వానాన్ని ట్విట్టర్ వేదికగా గవర్నర్ పంచుకున్నారు. భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా 3 టీ20 మ్యాచ్‌లతో కూడిన సిరీస్‌లో మూడో మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలంటూ హెచ్‌సీఏ సభ్యులతో కలిసి తమిళిసైని అజార్ ఆహ్వానించారు.