ఏపీ అసెంబ్లీ ముందుకు వ‌చ్చిన బిల్లులు, ఆమోదం పొందిన బిల్లులివే!

  • సోమ‌వారం మూడో రోజు అసెంబ్లీ స‌మావేశాలు
  • స‌భ‌లో 4 బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన వైసీపీ స‌ర్కారు
  • ఇదివ‌ర‌కే ప్ర‌వేశ‌పెట్టిన 3 బిల్లుల‌కు ఆమోదం
ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా మూడో రోజైన సోమ‌వారం స‌భ ముందుకు ప‌లు కీల‌క బిల్లులను వైసీపీ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టింది. అంతేకాకుండా ఇదివ‌ర‌కే ప్ర‌వేశ‌పెట్టిన ప‌లు బిల్లుల‌కు ఆమోదం ల‌భించేలా వ్యూహాన్ని అమ‌లు చేసింది. ఇదివ‌ర‌కే ప్ర‌వేశ‌పెట్టిన ద ఇండియన్ స్టాంప్ ఆంధ్రప్రదేశ్ అమెండ్ మెంట్ బిల్లు, ఆంధ్రప్రదేశ్ యూనివర్శిటీస్ యాక్ట్ అమెండ్ మెంట్ బిల్లు, రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అమెండ్ మెంట్ బిల్లుల‌ను సభ ఆమోదించింది. 

అదే విధంగా సోమ‌వారం వైసీపీ సర్కారు ప‌లు బిల్లుల‌ను స‌భలో ప్ర‌వేశ‌పెట్టింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అమెండ్ మెంట్ బిల్లు-2022, ఆంధ్రప్రదేశ్ సర్వే అండ్ బౌండరీస్ అమెండ్ మెంట్ బిల్లు-2022, ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్లు, ఆంధ్రప్రదేశ్ టెనెన్సీ రిపీల్ బిల్లు, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ అమెండ్ మెంట్ బిల్లుల‌ను ప్ర‌భుత్వం స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టింది.


More Telugu News