ఏపీ ప్రభుత్వం పోలవరం నిర్వాసితుల జాబితాను కేంద్రానికి ఇవ్వలేదు: సోము వీర్రాజు
- పోలవరంపై అసెంబ్లీలో సీఎం జగన్ వివరణ
- సీఎం జగన్ అబద్ధాలు చెప్పారన్న వీర్రాజు
- దమ్ముంటే తమతో చర్చకు రావాలని సవాల్
బీజేపీ ప్రజా పోరు యాత్ర కార్యక్రమంలో భాగంగా విజయవాడ సింగ్ నగర్ శివాలయంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్నర్ మీటింగ్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీలో పోలవరం అంశంపై సీఎం జగన్ ప్రసంగం పట్ల స్పందించారు. పోలవరం నిర్వాసితుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వలేదని ఆరోపించారు. పోలవరం నిర్వాసితుల లిస్టు కేంద్రానికి ఇవ్వకుండా, అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ అబద్ధాలు చెప్పారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులు చెప్పకుండా కేంద్రంపై నిందలు వేస్తోందని మండిపడ్డారు. దమ్ముంటే తమతో పోలవరం అంశంలో చర్చకు రావాలని సోము వీర్రాజు వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.