ఏపీ హైకోర్టులో సినీ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీకి ఊరట
- 2019 ఎన్నికల ముందు ధర్నాకు దిగిన మోహన్ బాబు
- ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ మోహన్ బాబు, ఆయన కుమారులపై కేసు
- ప్రస్తుతం తిరుపతి కోర్టులో విచారణ దశలో ఉన్న కేసు
- కేసు విచారణను నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్
- 8 వారాల పాటు విచారణను నిలుపుదల చేసిన హైకోర్టు
ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబుకు సోమవారం ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మంచు మోహన్ బాబు, ఆయన ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్‌లపై తిరుపతి కోర్టులో ఓ కేసు విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా... ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ మోహన్ బాబు తన ఇద్దరు కుమారులతో కలిసి ధర్నాకు దిగారు.
ఈ వ్యవహారంపై మోహన్ బాబు, ఆయన ఇద్దరు కుమారులపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేయగా... ఈ కేసు విచారణ తిరుపతి కోర్టులో సాగుతోంది. ఈ విచారణను నిలుపుదల చేయాలంటూ మోహన్ బాబు ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు... తిరుపతి కోర్టులో కేసు విచారణను 8 వారాల పాటు నిలుపుదల చేసింది.