ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
- సోమవారం మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- సభలో పోలవరంపై స్వల్పకాలిక చర్చ
- పోలవరం జాప్యానికి కారణం టీడీపీనేనన్న జగన్
- జగన్ ప్రసంగానికి అడ్డు తగిలిన టీడీపీ సభ్యులు
- టీడీపీ సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేసిన స్పీకర్
ఏపీ అసెంబ్లీ మూడో రోజు సోమవారం సమావేశాల్లో భాగంగా టీడీపీ సభ్యులు సభ నుంచి సస్పెండ్ అయ్యారు. రెండు రోజుల విరామం తర్వాత సోమవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో తొలుత రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడిన తర్వాత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు జాప్యానికి కారణం టీడీపీనేనని ఆయన ఆరోపించారు.
అయితే, ఈ చర్చ సందర్భంగా తమ పార్టీపై అకారణంగా విమర్శలు గుప్పిస్తున్నారంటూ టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రసంగానికి కూడా అడ్డు తగిలారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం పలుమార్లు వారించారు. అయినా టీడీపీ సభ్యులు వినకపోవడంతో వారిని సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు.