ఆసీస్ తో టీ20 సిరీస్ కు టీమిండియా సన్నద్ధం... రేపే తొలి మ్యాచ్

  • టీమిండియా, ఆసీస్ మధ్య 3 మ్యాచ్ ల సిరీస్
  • టీ20 వరల్డ్ కప్ కు ముందు సన్నాహకం
  • జట్టు కూర్పును సమీక్షించుకోనున్న టీమిండియా
  • వనరులను పరీక్షించుకోనున్న ఆసీస్
టీమిండియాతో మూడు టీ20లు ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు భారత్ వచ్చింది. ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ రేపు (సెప్టెంబరు 20) మొహాలీ మైదానంలో జరగనుంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ కు ఈ సిరీస్ మంచి సన్నాహకం కానుంది. మెగా టోర్నీకి ముందు జట్టు కూర్పును సమీక్షించుకోవడానికి ఈ సిరీస్ ద్వారా టీమిండియా ముందు మంచి అవకాశం నిలిచింది. అటు ఆస్ట్రేలియా జట్టు కూడా తన వనరులను పరీక్షించుకోవడానికి ఈ సిరీస్ ను వినియోగించుకోనుంది. 

టీమిండియా...
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, అశ్విన్, చహల్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, ఉమేశ్ యాదవ్.

ఆస్ట్రేలియా...
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మాథ్యూ వేడ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్ వెల్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, ఆస్టన్ అగర్, డానియల్ సామ్స్, నాథన్ ఎల్లిస్, జోష్ ఇంగ్లిస్, హేజెల్ వుడ్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా, షాన్ అబ్బాట్, కేన్ రిచర్డ్ సన్.

టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదిగో...

తొలి మ్యాచ్- సెప్టెంబరు 20 (మొహాలీ)రెండో మ్యాచ్- సెప్టెంబరు 23 (నాగపూర్)మూడో మ్యాచ్- సెప్టెంబరు 25 (హైదరాబాద్)కాగా, ఈ సిరీస్ టీవీలో స్టార్ స్పోర్ట్స్ చానళ్ల ద్వారా ప్రసారమవుతుంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్, వెబ్ సైట్లలోనూ వీక్షించవచ్చు. తొలి మ్యాచ్ రాత్రి 7.00 గంటలకు ప్రారంభం కానుంది.


More Telugu News