ఎడ్లబండ్లను తీసుకుపోయిన పోలీసులు.. కాడిని భుజాలకు తగిలించుకుని బండ్లను రోడ్డుపైకి లాక్కొచ్చిన టీడీపీ నేతలు

  • రైతు సమస్యలపై నిరసనకు సిద్ధమైన టీడీపీ నేతలు
  • టీడీపీ సిద్ధం చేసుకున్న ఎండ్లబండ్లను తీసుకెళ్లిన పోలీసులు
  • వ్యవసాయ రంగం మూడేళ్లుగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయిందన్న బుచ్చయ్య చౌదరి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో నేడు రైతు సమస్యలపై నిరసన చేపట్టాలని టీడీపీ శాసనసభా పక్షం నిర్ణయించింది. ఇందులో భాగంగా టీడీపీ నేతలు ఎడ్లబండ్లను సిద్ధం చేసుకున్నారు. అయితే, ఈ ర్యాలీపై ఆంక్షలు విధించిన పోలీసులు టీడీపీ నేతలు సిద్ధం చేసుకున్న ఎడ్లబండ్లను తీసుకుపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిరసనకు దిగారు. 

అక్కడనున్న ఎడ్లబండ్లను తోసుకుంటూ రోడ్డుపైకి వచ్చారు. ఎడ్లకు బదులుగా ఎమ్మెల్యేలు కాడి తగిలించుకుని బండిని లాగారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వివాదం జరిగింది. టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని కోటరీ వల్లే రైతాంగానికి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. వ్యవసాయ రంగం మూడేళ్లుగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News