విదేశీయులను తాకొద్దన్న చైనా వైద్య నిపుణుడు.. చైనాలో నిరసనలు
- విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ
- చైనాలో అదే తొలి కేసు
- విదేశీయులను తాకకుండా ఉంటే మంకీపాక్స్ రాదన్న చైనా వైద్య నిపుణుడు
మంకీపాక్స్ బారిన పడకుండా ఉండాలంటే విదేశీయులను తాకొద్దంటూ చైనా వైద్య నిపుణుడు చేసిన సూచనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాల నుంచి చాంగ్‌కింగ్ నగరానికి వచ్చిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్టు శుక్రవారం నిర్ధారణ అయింది. చైనాలో నమోదైన తొలి మంకీపాక్స్ కేసు ఇదే. అప్రమత్తమైన వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం చీఫ్ ఎపిడమాలజిస్ట్ వూ జున్‌యు ఓ ప్రకటన చేస్తూ.. మంకీపాక్స్ ప్రబలకుండా అడ్డుకునేందుకు విదేశీయుల్ని తాకవద్దని, విదేశాల నుంచి వచ్చిన వారికి దూరంగా ఉండాలని సూచించారు.
కొత్తవాళ్లకు భౌతికంగా దూరంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో, హోటళ్లలో డిస్పోజబుల్ టాయిలెట్ సీటు కవర్లు వాడాలని సూచించారు. ఇందుకు సంబంధించి హాంకాంగ్‌కు చెందిన ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ ఓ వార్త ప్రచురించింది. దీంతో వూ జున్‌యు పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆయన సూచనలు వివక్షాపూరితంగా ఉన్నాయని విమర్శిస్తున్నారు. చైనాలోనూ ఆయన సూచనలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.