సరిహద్దు నుంచి వెనక్కి మళ్లిన చైనా బలగాలు

  • ఇటీవల భారత్, చైనా మధ్య 16వ రౌండ్ చర్చలు
  • సైన్యం ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభించిన చైనా
  • సరిహద్దుల నుంచి 3 కిలోమీటర్లు వెనక్కి!
  • బఫర్ జోన్ లో పెట్రోలింగ్ చేయరాదని భారత్ నిర్ణయం
గత కొంతకాలంగా భారత్ సరిహద్దుల వెంబడి కార్యకలాపాలు ముమ్మరం చేసిన చైనా కీలక నిర్ణయం తీసుకుంది. గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ ప్రాంతం నుంచి తన బలగాలను 3 కిలోమీటర్లు వెనక్కి రప్పించింది. సైన్యం ఉపసంహరణకు ముందు ఇక్కడ చైనా భారీ స్థావరం ఏర్పాటు చేసింది. అయితే, వెళుతూ వెళుతూ సైనిక స్థావరం ఆనవాళ్లు లేకుండా చేసింది. దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు బయటికి వచ్చాయి. 

ఇటీవల భారత్, చైనా మధ్య 16వ విడత చర్చలు జరిగాయి. ఈ చర్చల అనంతరం చైనా ఉపసంహరణ ప్రక్రియ చేపట్టినట్టు తెలుస్తోంది. అదే సమయంలో, బఫర్ జోన్ లో పెట్రోలింగ్ నిర్వహించకూడదని భారత్ నిర్ణయించింది.


More Telugu News