చికిత్సకు డబ్బుల్లేక ప్రభుత్వాసుపత్రిలో చేరిన సీనియర్ నటి
- 400కి పైగా చిత్రాల్లో నటించిన జయకుమారి
- దక్షిణాదిన ప్రముఖ నటిగా గుర్తింపు
- రెండు కిడ్నీలు పాడైన వైనం
- చెన్నై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స
దక్షిణాది సినీ రంగంలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన జయకుమారి ఇప్పుడు దీనస్థితిలో ఉన్నారు. 70 ఏళ్ల జయకుమారికి రెండు కిడ్నీలు పాడయ్యాయి. అయితే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు డబ్బు లేకపోవడంతో ఆమె చెన్నై ప్రభుత్వాసుపత్రిలో చేరారు.
జయకుమారి చెన్నైలోని వేలచ్చేరి ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆమెకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 400కి పైగా చిత్రాల్లో నటించారు. తన నటన, డ్యాన్స్ తో భాషలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె భర్త అబ్దుల్లా చాన్నాళ్ల కిందటే మరణించారు. కాగా, చెన్నై ప్రభుత్వాసుపత్రిలో జయకుమారి చికిత్స పొందుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.