నార్త్ ఇండియా మెంటాల్టీ: శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు

  • చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
  • మహిళా నాయకత్వాన్ని దేశం అంగీకరించేందుకు సిద్ధంగా లేదన్న పవార్
  • కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పటి నుంచి తాను ఈ అంశంపై మాట్లాడుతున్నానని వ్యాఖ్య
పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించకపోవడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నార్త్ ఇండియా మెంటాల్టీ అని కామెంట్ చేశారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఏళ్లు గడుస్తున్నా పార్లమెంటులో ఈ బిల్లుకు ఆమోదముద్ర పడలేదు. మహిళా నాయకత్వాన్ని అంగీకరించేందుకు దేశం ఇప్పటికీ సిద్ధంగా లేదని ఆయన అన్నారు. 

మహిళల రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పటి నుంచి తాను పార్లమెంటులో మాట్లాడుతూనే  ఉన్నానని... కానీ, ఇప్పటి వరకు ఆ బిల్లుకు ఆమోదం లభించలేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్లపై పార్లమెంటులో మాట్లాడిన తర్వాత... తమ పార్టీ ఎంపీలు కూడా లేచి వెళ్లిపోతుండటాన్ని తాను చూశానని... అంటే, తమ పార్టీ నేతలకు కూడా మహిళా రిజర్వేషన్లు ఇష్టం లేదనే విషయం అర్థమవుతోందని అన్నారు.


More Telugu News