దేశంలో మరో ఐదు వేల కరోనా కేసులు
- గత 24 గంటల్లో 5,664 మందికి కరోనా పాజిటివ్
- ప్రస్తుతం దేశంలో 47,922 క్రియాశీల కేసులు
- వైరస్ వల్ల తాజాగా 29 మంది మృతి
దేశంలో కరోనా వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. రోజూ ఐదు వేల పైచిలుకు కేసులు వస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 5,664 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం ప్రకటించింది. మొన్నటితో పోలిస్తే వంద కేసులు తగ్గాయి. ప్రస్తుతం దేశంలో 47,922 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 4,555 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దాంతో, దేశంలో ఇప్పటిదాకా కరోనాను జయించిన వారి సంఖ్య 4,39,57,929కి చేరుకుంది. రికవరీ రేటు 98.71 శాతంగా నమోదైంది.
కరోనా వల్ల గత 24 గంటల్లో మరో 29 మంది మృతి చెందారు. దాంతో, దేశంలో కరోనా మృతుల సంఖ్య 5,28,327కి చేరుకుంది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.69 శాతంగా, క్రియాశీల రేటు 0.11 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. దేశ వ్యాప్త వ్యాక్సినేషన్లో భాగంగా ఇప్పటి వరకు 2,16,56,54,766 మందికి కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. నిన్న 14,84,216 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.