ఈ చీతాలను ఎప్పుడు తీసుకొస్తారు!... మోదీపై ప్రకాశ్ రాజ్ సెటైర్!
- అంతరించిన చీతాలను తిరిగి దేశంలోకి ఎంట్రీ ఇప్పించిన మోదీ
- బ్యాంకులను బురిడీ కొట్టించి వెళ్లిన వారిని ఎప్పుడు తీసుకొస్తారన్న ప్రకాశ్ రాజ్
- మాల్యా, నీరవ్, ఛోక్సీల ఫొటోలతో ట్వీట్ చేసిన నటుడు
దేశంలో అంతరించిపోయిన చీతాల జాతిని తిరిగి దేశంలో ప్రవేశపెట్టే దిశగా నరేంద్ర మోదీ సర్కారు చేపట్టిన చర్యలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. తన జన్మదినాన ప్రధాని మోదీ... నమీబియా నుంచి రప్పించిన 8 చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో పార్క్‌లో తన చేతులతో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వంపై... ప్రత్యేకించి ప్రధాని మోదీపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్... మోదీని టార్గెట్ చేస్తూ శనివారం రాత్రి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అడవుల్లో తిరిగే చీతాలను రప్పించారు.. మరి బ్యాంకుల నుంచి వేలాది కోట్లు రుణాలు తీసుకుని దేశ ప్రజలను మోసం చేసి విదేశాలకు పారిపోయిన వారిని ఎప్పుడు రప్పిస్తారు? అనే అర్థం వచ్చేలా ప్రకాశ్ రాజ్ ఆ పోస్ట్‌ను పెట్టారు.
'ఈ చీతాలను ఎప్పుడు తీసుకొస్తారు' అంటూ ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. తాను చెప్పే చీతాలు ఇవేనంటూ విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీల ఫొటోలను ఆయన తన ట్వీట్‌కు జత చేశారు. జస్ట్ ఆస్కింగ్ పేరిట బీజేపీ విధానాలను ఆది నుంచి విమర్శిస్తూ వస్తున్న ప్రకాశ్ రాజ్ తాజా ట్వీట్‌కు కూడా అదే ట్యాగ్‌ను జత చేశారు.