అధర్మం అంతర్జాతీయ కోర్టుకు వెళ్లినా అంతిమ విజయం న్యాయానిదే: నారా లోకేశ్

  • అమ‌రావ‌తిపై హైకోర్టు తీర్పును సుప్రీంలో స‌వాల్ చేసిన ఏపీ ప్ర‌భుత్వం
  • ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ప‌లు పార్టీలు
  • ఏక వాక్య ప్ర‌క‌ట‌న‌తో స‌ర్కారు నిర్ణ‌యాన్ని ఖండించిన లోకేశ్
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తేన‌ని హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్ర‌భుత్వం శ‌నివారం సుప్రీంకోర్టులో స‌వాల్ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ స‌ర్కారు తీసుకున్న ఈ నిర్ణ‌యం రాజ‌ధాని రైతుల‌తో పాటు రైతుల ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప‌లుకుతున్న పార్టీలు తీవ్ర స్థాయిలో మండి ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ ఏక వాక్యంతో కూడిన ట్వీట్‌తో జ‌గ‌న్ స‌ర్కారు నిర్ణ‌యాన్ని ఎండ‌గ‌ట్టారు.  

'అధర్మం అంతర్జాతీయ కోర్టుకు వెళ్లినా అంతిమ విజయం న్యాయానిదే' అని నారా లోకేశ్ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఏపీ ఏకైక రాజ‌ధానిగా అమరావతినే కొన‌సాగించాలంటూ రాజ‌ధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు ప్ర‌తి చిన్న అంశంలోనూ హైకోర్టును ఆశ్ర‌యించి అమ‌రావతిని కాపాడుకుంటూ వ‌స్తున్న విషయాన్ని త‌న ట్వీట్‌లో చెప్పిన లోకేశ్... ఏపీ స‌ర్కారు ఏ స్థాయి కోర్టుకు వెళ్లినా... విజ‌యం మాత్రం న్యాయం కోసం శ్ర‌మిస్తున్న రైతుల‌దేన‌ని చెప్పారు.


More Telugu News