గుజరాత్‌లోనూ 'పెన్షన్ స్కీం' ఆందోళనలు.. స్తంభించిన ప్రభుత్వ సేవలు
- సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ సామూహిక సెలవు పెట్టిన గుజరాత్ ఉద్యోగులు
- శనివారం తెరచుకోని ప్రభుత్వ కార్యాలయాలు
- రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన ప్రభుత్వ పాఠశాలలు
ఏపీలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి దాని స్థానంలో పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్)ను అమలు చేయాలంటూ గత కొంతకాలంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఈ తరహా ఆందోళనలు మిన్నంటాయి. ఏపీ ఉద్యోగుల మాదిరే గుజరాత్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఓపీఎస్‌ను ప్రవేశపెట్టాలని కోరుతున్నారు.
ఈ ఆందోళనల్లో భాగంగా శనివారం గుజరాత్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా విధులు బహిష్కరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులంతా శనివారం సామూహిక సెలవు పెట్టి విధులు బహిష్కరించారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు తెరచుకోలేదు. ఈ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సేవలు స్తంభించిపోయాయి.