గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్లు... 10 రోజుల్లో ఉత్త‌ర్వులు ఇస్తాం: కేసీఆర్‌

  • హైద‌రాబాద్‌లో గిరిజ‌న‌, బంజారా భ‌వ‌న్ల‌ను ప్రారంభించిన కేసీఆర్‌
  • గిరిజ‌నుల‌కు గిరిజ‌న బంధు అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌
  • గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్ల పెంపుపై కేంద్రం నుంచి స్పంద‌న లేద‌ని వెల్ల‌డి
తెలంగాణ సీఎం కేసీఆర్ శ‌నివారం మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను 10 రోజుల్లో విడుద‌ల చేస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. శ‌నివారం హైద‌రాబాద్‌లో నూత‌నంగా నిర్మించిన గిరిజ‌న‌, బంజారా భ‌వ‌న్‌ల‌ను ప్రారంభించిన అనంత‌రం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన సంద‌ర్భంగా కేసీఆర్ ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

రాష్ట్రంలోని ద‌ళితుల అభ్యున్న‌తి కోసం అమ‌లు చేస్తున్న ద‌ళిత బంధు మాదిరిగానే గిరిజ‌నుల స‌ర్వ‌తోముఖాభివృద్ధికి గిరిజ‌న బంధును త్వ‌ర‌లోనే అమ‌లు చేస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్ల‌ను 10 శాతానికి పెంచుతూ ఇదివ‌ర‌కే అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపిన‌ట్లు కేసీఆర్ తెలిపారు. అయితే ఇప్ప‌టిదాకా కేంద్రం నుంచి ఈ విష‌యంపై స్పంద‌నే లేద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక కేంద్రం ఆమోదంతో ప‌ని లేకుండానే గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.


More Telugu News