అజయ్ దేవగణ్ సినిమాకు షాకిచ్చిన కువైట్ ప్రభుత్వం
- అక్టోబర్ 24న విడుదలవుతున్న 'థాంక్ గాడ్' చిత్రం
- మత విశ్వాసాలను దెబ్బతీసే సన్నివేశాలున్నాయన్న కువైట్
- సినిమా విడుదలపై నిషేధం విధించిన వైనం
అజయ్ దేవగణ్ తాజా చిత్రం 'థాంక్ గాడ్'కు కువైట్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మత విశ్వాసాలను దెబ్బ తీసేలా సినిమా ట్రైలర్ ఉందనే కారణంతో ఈ చిత్రంపై అక్కడి సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాపై నిషేధం విధించింది. అభ్యంతరకరమైన సన్నివేశాన్ని తీసేస్తే... సినిమా విడుదలకు అనుమతిస్తామని తెలిపింది. ఈ సినిమా ఫాంటసీ కామెడీగా తెరకెక్కింది. ఈ చిత్రంలో చిత్రగుప్తుడిగా అజయ్ దేవగణ్ కనిపిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలను పోషించారు. అక్టోబర్ 24న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.