ఫస్ట్ రౌండ్ లోనే వెనక్కొస్తారు: టీ20 ప్రపంచకప్ కు ఎంపిక చేసిన పాకిస్థాన్ జట్టుపై షోయబ్ అఖ్తర్ తీవ్ర విమర్శలు

  • జట్టు మిడిల్ ఆర్డర్ లో డెప్త్ లేదన్న అఖ్తర్
  • పాక్ జట్టుకు కష్ట కాలం రాబోతోందని వ్యాఖ్య
  • మెరుగైన జట్టును ఎంపిక చేసుంటే బాగుండేదన్న అఖ్తర్
టీ20 ప్రపంచకప్ కు ఎంపిక చేసిన పాకిస్థాన్ టీమ్ సెలెక్షన్ పై ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ విమర్శలు గుప్పించారు. ఇటీవల ఆసియా కప్ కు ఎంపిక చేసిన జట్టుకు, ఈ జట్టుకు పెద్దగా తేడా లేదని ఆయన అన్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో అస్ట్రేలియాలో ప్రపంచ కప్ జరగనుంది. పాక్ టీమ్ కు బాబర్ ఆజమ్ ను కెప్టెన్ గా, షాదాబ్ ఖాన్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు.

పాక్ జట్టు ఎంపికపై అఖ్తర్ మాట్లాడుతూ... మిడిల్ ఆర్డర్ లో డెప్త్ లేదని అన్నారు. ఆస్ట్రేలియాలో జరగబోయే ఈ టోర్నీలో సెమీ ఫైనల్స్ కు వెళ్లడం కూడా కష్టమేనని జోస్యం చెప్పారు. ఈ టీమ్ మిడిల్ ఆర్డర్ ను చూస్తుంటే ఫస్ట్ రౌండ్ లోనే పాక్ వెనుదిరగొచ్చనిపిస్తోందని అన్నారు. పాక్ క్రికెట్ జట్టుకు కష్ట కాలం రాబోతోందని చెప్పారు. ఈ జట్టు కంటే మెరుగైన జట్టును ఎంపిక చేసుంటే బాగుండేదని అన్నారు. 

టీ20 ప్రపంచ కప్ కు పాక్ జట్టు ఇదే:
బాబర్ ఆజమ్, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, హారిస్ రవూఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్ దిల్ షా, మొహమ్మద్ హస్నైన్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీమ్, నసీమ్ షా, షహీన్ షా ఆఫ్రిదీ, షాన్ మసూద్, ఉస్మాన్ ఖాదిర్. 

రిజర్వ్ బెంచ్: ఫక్తర్ జమాన్, మొహమ్మద్ హారిస్, షానవాజ్ దహానీ.


More Telugu News