మూడు రాజధానులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

  • అమరావతే ఏపీ రాజధాని అని చెప్పిన హైకోర్టు
  • నెల రోజుల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశం
  • హైకోర్టు నిర్ణయం శాసన వ్యవస్థ అధికారాలను  ప్రశ్నించడమేనన్న ఏపీ ప్రభుత్వం
అమరావతే ఏపీ రాజధాని అంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని తన పిటిషన్ లో కోరింది. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని... ప్రభుత్వ నిర్ణయాన్ని ఆపేయాలనుకోవడం శాసన వ్యవస్థ అధికారాలను ప్రశ్నించడమే అవుతుందని సుప్రీంకోర్టుకు తెలిపింది. 

సీఆర్డీయే చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని, నెల రోజుల్లో అమరావతిలో అన్ని సదుపాయాలను కల్పించాలని హైకోర్టు ఆదేశించడం సరికాదని పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని పిటిషన్ లో తెలిపింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని చెప్పడం శాసనసభను అగౌరవపరచడమేనని చెప్పింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


More Telugu News