ఈ సారి హిట్ కొట్టకపోతే మాత్రం కష్టమే!

  • శ్రీ విష్ణు హీరోగా రూపొందిన 'అల్లూరి'
  • నిన్ననే జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్
  • హిట్ పై గట్టిగానే ఆశలు పెట్టుకున్న శ్రీవిష్ణు 
  • ఈ నెల 23వ తేదీన సినిమా విడుదల
యంగ్ హీరోలు చాలామంది ఇప్పుడు హిట్టు కోసం బెంగ పెట్టుకున్నారు. కొత్త  కథలతో .. కొత్త దర్శకులతో తమవంతు ప్రయత్నం చేస్తున్నారుగానీ .. హిట్టు మాత్రం ఒక పట్టాన పట్టుబడటం లేదు. 'కార్తికేయ 2'తో నిఖిల్, అతికష్టం మీద అరడజను ఫ్లాపుల తరువాత 'ఒకే ఒక జీవితం'తో శర్వానంద్ ఈ జాబితాలో నుంచి బయటపడ్డారు.  

ఇక నాని .. నాగశౌర్య .. కార్తికేయ .. సుధీర్ బాబు .. చైతూ ఇలా అందరూ కూడా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఆ జాబితాలో శ్రీవిష్ణు కూడా కనిపిస్తున్నాడు. ఇంతకుముందు ఆయన చేసిన 'అర్జున ఫల్గుణ' .. 'భళా తందనాన' సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. 

దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన 'అల్లూరి'  సినిమా చేశాడు. బెక్కెం వేణుగోపాల్  నిర్మించిన ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించాడు. రీసెంట్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుపుకున్న ఈ సినిమా, ఈ నెల 23వ తేదీన థియేటర్లకు రానుంది. శ్రీ విష్ణు గ్రాఫ్ పుంజుకోవాలంటే ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టవలసిందే.


More Telugu News