పనితీరు ఆధారంగానే పార్టీ టికెట్లు: చంద్రబాబు
- సిట్టింగ్‌లందరికీ సీట్లు కేటాయించిన చంద్రబాబు
- పాణ్యం, బనగానపల్లె, ఏలూరు ఇంచార్జీలతో భేటీ
- పార్టీని బలోపేతం చేసే దిశగా నేతలకు సూచనలు
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అప్పుడే 2024 ఎన్నికలపై దృష్టి సారించారు. గురువారం పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారందరికీ అవే స్థానాల్లో సీట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు.. తాజాగా శుక్రవారం మూడు నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఇంచార్జీలతో సమావేశమయ్యారు. ఈ భేటికి నంద్యాల జిల్లాలోని పాణ్యం, బనగానపల్లె ఇంచార్జీలు గౌరు చరితారెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డితో పాటు ఏలూరు ఇంచార్జీ బడేటి రాధాకృష్ణ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు ఆరా తీశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయతీరాలకు చేరాలంటే ఏ ఒక్క నియోజకవర్గాన్ని కూడా నిర్లక్ష్యం చేయరాదని ఆయన తెలిపారు. ఏ నియోజకవర్గంలో అయినా పనితీరు ఆధారంగానే నేతలకు టికెట్లు కేటాయిస్తామని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం ద్వారా ప్రజలకు చేరువై... పార్టీని మరింతగా బలోపేతం చేయాలని ఆయన సూచించారు.