ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్
- డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా
- డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
- నామినేషన్ పత్రాలు సమర్పించిన కోలగట్ల
- సోమవారం ఎన్నిక!
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేసిన నేపథ్యంలో, ఎన్నిక జరగనుంది. ఈ ఉదయమే నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నేపథ్యంలో, డిప్యూటీ స్పీకర్ పదవికి వైసీపీ తరఫున కోలగట్ల వీరభద్రస్వామి ఈ సాయంత్రం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. నామినేషన్లకు ఈ సాయంత్రం వరకు గడువు ఉంది.
కాగా, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సోమవారం జరగనుంది. ఈ పదవికి టీడీపీ నుంచి పోటీ ఉండదని తెలుస్తోంది. దాంతో కోలగట్ల ఎన్నిక ఏకగ్రీవం కావడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే, కోన రఘుపతిని డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని వైసీపీ హైకమాండ్ కోరినట్టు సమాచారం.