ఈ నెల 20న తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం... రేపు ప్రత్యేక ప్రవేశ టికెట్ల విడుదల
- ఈ నెల 27 నుంచి బ్రహ్మోత్సవాలు
- ముందుగా ఆలయ శుద్ధి
- ఏటా నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల క్షేత్రం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 27 నుంచి అక్టోబరు 5 వరకు వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, తిరుమలలో ఈ నెల 20న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. అందుకోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్లను రేపు విడుదల చేయనున్నారు. ఆన్ లైన్ కోటా టికెట్లను రేపు ఉదయం 9 గంటల నుంచి అందుబాటులో ఉంచుతున్నామని టీటీడీ వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.
ప్రతి ఏడాది నాలుగు పర్యాయాలు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు మంగళవారం నాడు ఆలయ శుద్ధి కార్యక్రమం చేపడతారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పేరిట చేపట్టే ఈ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాతే భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.