అమరావతిలో అక్రమాలంటూ మూడేళ్లుగా ఆరోపిస్తున్నారే తప్ప ఒక్క ఆధారమైనా చూపించారా?: వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసిన జీవీఎల్

  • ఏపీ రాజధాని అంశంపై జీవీఎల్ స్పందన
  • మూడేళ్లుగా వేసిన కేసెట్టే మళ్లీ వేస్తున్నారని విమర్శలు
  • విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించడంలేదని ఆరోపణ
అమరావతిలో అక్రమాలంటూ మూడేళ్లుగా ఆరోపణలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక్క ఆధారం కూడా చూపించలేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. రాష్ట్రంలో మూడు రాజధానుల విధానం సాధ్యం కాదని సీఎం జగన్ కు, వైసీపీ సర్కారుకు తెలుసని అన్నారు. అయినప్పటికీ, మూడేళ్లుగా వేసిన కేసెట్టే మళ్లీ మళ్లీ వేస్తున్నారని వ్యాఖ్యానించారు. 

విశాఖపట్నంలో రాజధాని అంటున్నారు... అక్కడ భూ దందాలు చేయడానికా? అని ప్రశ్నించారు. నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నవాళ్లయితే విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం పట్ల ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీశారు. విశాఖ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక సహాయసహకారాలు అందాల్సి ఉంది... కానీ అందడంలేదు అని ఆరోపించారు. విశాఖ అభివృద్ధికి సహకరించని జగనే... విశాఖ రాజధాని అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని జీవీఎల్ మండిపడ్డారు. 

అమరావతిలో మౌలిక వసతులు కల్పిస్తే  కార్యాలయాలు ఏర్పాటు చేస్తామంటూ కేంద్ర సంస్థలు చెబుతున్నా జగన్ సర్కారు పట్టించుకోవడంలేదని అన్నారు.


More Telugu News