ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా

  • నిన్న ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • వికేంద్రీకరణపై చర్చ
  • తొలిరోజు టీడీపీ సభ్యుల సస్పెన్షన్
  • నేడు కూడా టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు
  • రెండోరోజు సభలో ఆర్థికాభివృద్ధిపై చర్చ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ సుదీర్ఘ వివరణ అనంతరం ఏపీ అసెంబ్లీ వాయిదా పడింది. శాసనసభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఏపీ శాసనసభ సమావేశాలు నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. సభలో ప్రారంభం నుంచే వాడీవేడి వాతావరణం నెలకొంది. నిన్న టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురి కాగా, ఇవాళ కూడా స్పీకర్ ఆగ్రహానికి గురై సస్పెండ్ అయ్యారు. 

కాగా, నిన్న సభలో వికేంద్రీకరణ అంశంపై స్వల్పకాలిక చర్చ చేపట్టగా, నేడు ఆర్థికాభివృద్ధి అంశంపై చర్చ చేపట్టారు. వైసీపీ ఎమ్మెల్యేల నుంచి మంత్రులు, సీఎం జగన్ వరకు అందరూ గత ప్రభుత్వంపైనా, చంద్రబాబుపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. అంతకుముందు, వైసీపీ ప్రభుత్వం సభలో 8 బిల్లులు ప్రవేశపెట్టింది. ల్యాండ్ టైటిలింగ్ బిల్లు, సివిల్ సర్వీసెస్ రిపీల్ బిల్లు, అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ బిల్లు, పంచాయతీరాజ్ సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు వాటిలో ముఖ్యమైనవి.


More Telugu News