వచ్చే నెలలో విజయవాడకు వెళ్తున్న కేసీఆర్
- అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో సీపీఐ జాతీయ మహాసభలు
- సభలకు ఆహ్వానం.. హాజరవుతున్న కేసీఆర్
- మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో చేతులు కలిపిన టీఆర్ఎస్, సీపీఐ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడేళ్ల తర్వాత మళ్లీ విజయవాడకు వెళ్తున్నారు. అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో సీపీఐ జాతీయ మహాసభలు జరగనున్నాయి. ఈ సభలకు పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులను సీపీఐ ఆహ్వానించింది. వీరిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కేరళ సీఎం పినరయి విజయన్ ఉన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, సీపీఐ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ మహాసభలకు కేసీఆర్ హాజరు కానున్నారు. సీపీఐ జాతీయ స్థాయి నేతలు, 29 రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు హాజరవుతారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ నేతలు కూడా రానున్నారు. 20 దేశాలకు చెందిన కమ్యూనిస్టు నేతలు కూడా హాజరుకానున్నారు.