ఇక్కడ వరదలు.. అక్కడ యుద్ధం.. అయినా సరే జిహ్వచాపల్యాన్ని చంపుకోలేకపోయిన పుతిన్, షాబాజ్ షరీఫ్: వీడియో ఇదిగో

  • ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు ఉజ్బెకిస్థాన్ చేరుకున్న దేశాధినేతలు
  • అపూర్వ స్వాగతం పలికిన ఉజ్బెక్
  • అతిథుల కోసం అద్భుతమైన వంటకాలు 
  • జిహ్వచాపల్యాన్ని ఆపుకోలేక వెళ్తూవెళ్తూ రుచి చూసిన పుతిన్, షాబాజ్, ఎర్గోన్
వారందరూ దేశాధినేతలు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఉజ్బెకిస్థాన్‌లోని సమకర్‌కండ్ చేరుకున్నారు. అక్కడ వారికి అపూర్వ స్వాగతం లభించింది. ఇక్కడికొచ్చిన నేతల దేశాల్లో వివిధ పరిస్థితులు, సమస్యలు నెలకొని ఉన్నాయి.

 పాకిస్థాన్‌ను ఎన్నడూ లేనంతగా వరదలు ముంచెత్తాయి. దాదాపు 1400 మంది చనిపోయినట్టు ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ స్వయంగా వెల్లడించారు. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసినట్టు చేసినట్టు చెప్పారు. మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించారు. ఫిబ్రవరిలో మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న పుతిన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని దేశాలు రష్యాపై ఆంక్షలు కూడా విధించాయి.

పరిస్థితులు ఇలా ఉంటే ఉజ్బెకిస్థాన్‌లో ల్యాండైన నేతలు జిహ్వచాపల్యాన్ని చంపుకోలేకపోయారు. అతిథుల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలను చూసి మనసును నిలువరించుకోలేకపోయారు. దేశాధి నేతలైనా రుచులకు దాసోహం కాకతప్పదని నిరూపించారు. సిద్ధం చేసిన ఆహార పదార్థాల వద్దకు వెళ్లి వాటి రుచి చూసి ‘ఓహో’ అంటూ లొట్టలు వేశారు. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ తదితరులు ఆహార పదార్థాల వద్దకు వెళ్లి రుచులు ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.


More Telugu News