ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ స‌భ్యుల స‌స్పెన్ష‌న్‌

  • గురువారం ఉద‌యం ప్రారంభ‌మైన ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు
  • ఉద్యోగాల క‌ల్ప‌న‌పై చ‌ర్చ‌కు టీడీపీ ప‌ట్టు
  • టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిర‌స్క‌రించిన స్పీక‌ర్‌
  • అధికార వికేంద్రీక‌ర‌ణ‌పై అధికార‌, విప‌క్షాల మధ్య వాగ్వివాదం 
  • మంత్రి బుగ్గన ప్ర‌తిపాద‌న‌తో టీడీపీ స‌భ్యుల‌ను ఒక రోజు స‌స్పెండ్ చేసిన స్పీక‌ర్‌
ఏపీ అసెంబ్లీ స‌మావేశాల నుంచి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి చెందిన స‌భ్యులు స‌భ నుంచి స‌స్పెండ్ అయ్యారు. గురువారం ఉద‌యం ప్రారంభ‌మైన అసెంబ్లీలో స్పీక‌ర్ ప్ర‌శ్నోత్త‌రాల‌ను ప్రారంభించ‌గా... ఉద్యోగాలు ఇవ్వ‌ని జ‌గ‌న్ స‌ర్కారు తీరుపై చ‌ర్చ‌కు టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ తీర్మానాన్ని స్పీక‌ర్ తిర‌స్క‌రించ‌గా... ఈ అంశంపై చ‌ర్చ జ‌ర‌గాల్సిందేన‌ని టీడీపీ స‌భ్యులు ప‌ట్టుబ‌ట్టారు.

ఆ త‌ర్వాత కొంత‌సేప‌టికి స‌భలో అధికార వికేంద్రీక‌ర‌ణ‌పై వైసీపీ ప్ర‌తిపాదించిన స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ‌పై టీడీపీ, వైసీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం నెల‌కొంది. రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని వైసీపీ సభ్యులు ఆరోపిస్తే... కోర్టుల్లో వేసిన కేసుల‌ను ఎందుకు ఉప‌సంహ‌రించుకున్నార‌ని టీడీపీ నిల‌దీసింది. ఈ క్ర‌మంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య వాద‌న తారస్థాయికి చేర‌గా... మంత్రి బుగ్గన ప్ర‌తిపాద‌న మేర‌కు టీడీపీకి చెందిన స‌భ్యుల‌ను స్పీక‌ర్ ఒక రోజు పాటు స‌భ నుంచి స‌స్పెండ్ చేశారు.


More Telugu News