తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు.. సాయంత్రంలోగా ఉత్తర్వులు
- నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ నిర్ణయం
- ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు ఆదేశం
- గురువారం సాయంత్రంలోగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం
తెలంగాణ నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని టీఆర్ఎస్ సర్కారు నిర్ణయించింది. గురువారం ఈ మేరకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా గురువారం సాయంత్రంలోగా దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఢిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలంటూ పలు వర్గాల నుంచి వచ్చిన వినతుల మేరకు... ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటూ టీఆర్ఎస్ సర్కారు ఇటీవలే ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. అయితే కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.