దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 6,422 కేసుల నమోదు
- 46,389కి తగ్గిన యాక్టివ్ కేసులు
- ఇప్పటి వరకు కరోనాతో 5,28,25 మంది మృతి
మన దేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 6,422 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనికి ముందు రోజు 5,108 కేసులు నమోదు కావడం గమనార్హం. మరోవైపు ఇదే సమయంలో 5,748 మంది కరోనా నుంచి కోలుకోగా... 14 మంది మహమ్మారికి బలయ్యారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,45,16,479కి చేరుకుంది. వీరిలో 4,39,41,840 మంది కోలుకోగా... 5,28,250 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు సంఖ్య 46,389కి తగ్గింది.
దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.04 శాతంగా, క్రియాశీల రేటు 0.10 శాతంగా, రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,15,98,16,124 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 31,09,550 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.