మూడు రాజధానుల బిల్లు.. ప్రజలను మోసగించేందుకే: రఘురామ కృష్ణరాజు
- మరికాసేపట్లో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు
- రాజధానిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్న రఘురామ
- విద్వేషాలు రెచ్చగొట్టే మంత్రులు, మాజీ మంత్రులపై కేసులు పెట్టాలని ప్రతిపక్షాలకు సూచన
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఏపీకి మూడు రాజధానులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నిన్న ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడుతున్నట్టు ఆరోపించారు. రాజధాని విషయంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, దానిపై ప్రభుత్వం అప్పీలుకు కూడా వెళ్లలేదని గుర్తు చేశారు.
మంత్రులు, మాజీ మంత్రులు ప్రజల మధ్య, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్న రఘురామ.. ఇలాంటి వారిపై ప్రతిపక్ష నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. వారు కనుక కేసు నమోదు చేయకుంటే మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేయాలని రఘురామ పేర్కొన్నారు.