కేంద్ర మంత్రిని కలిసిన జీవీఎల్.. విశాఖలో సీజీహెచ్ఎస్ కార్యాలయం ఏర్పాటు చేయాలని వినతి
- కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయతో జీవీఎల్ భేటీ
- సీజీహెచ్ఎస్ అమలుపై చర్చ
- ఏపీకి సీజీహెచ్ఎస్ అదనపు డైరెక్టర్‌ను నియమించాలని వినతి
- విశాఖలో సీజీహెచ్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థన
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం(సీజీహెచ్ఎస్) అమలుకు సంబంధించి రెండు కీలక అంశాలను ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో సీజీహెచ్ఎస్ పర్యవేక్షణకు అదనపు డైరెక్టర్‌ను నియమించాలని, విశాఖలో సీజీహెచ్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు.
8 ఏళ్ల క్రితం రాష్ట్ర విభజన జరిగినప్పటికీ, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న తెలంగాణ సీజీహెచ్ఎస్ అదనపు డైరెక్టరే ఏపీలోని ఆ పథకాన్ని పర్యవేక్షిస్తున్నారని జీవీఎల్ తెలిపారు. ఇతర దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ సీజీహెచ్ఎస్ అదనపు డైరెక్టర్లు ఉన్నారని, ఏపీకి మాత్రమే అదనపు డైరెక్టర్ లేని విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఏపీలో సీజీహెచ్ఎస్ కార్యాలయం లేకపోవడం వల్ల ఏపీలోని రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీజీహెచ్ఎస్ సేవలను అందించడంలో విపరీత జాప్యం జరుగుతోందని జీవీఎల్ పేర్కొన్నారు.