సినీ కార్మికుల వేత‌నాల పెంపున‌కు నిర్మాత‌ల మండ‌లి అంగీకారం

  • వేతనాల పెంపు కోసం మూడేళ్లుగా సినీ కార్మికుల పోరాటం
  • బుధ‌వారం కార్మికుల‌తో నిర్మాత‌ల మండ‌లి భేటీ
  • వేత‌నాల‌ను 30 శాతం మేర పెంచేందుకు మండ‌లి అంగీకారం
తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో గ‌డ‌చిన 3 ఏళ్లుగా ప‌రిష్కారం కాని ఓ స‌మ‌స్య‌కు బుధ‌వారం ముగింపు ల‌భించింది. త‌మ వేత‌నాలు పెంచాలంటూ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన కార్మికులు మూడేళ్లుగా డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌మస్య‌పై ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిగినా ఫ‌లితం మాత్రం రాలేదు. తాజాగా బుధ‌వారం హైద‌రాబాద్‌లో నిర్మాత‌ల మండ‌లితో సినీ కార్మికుల సంఘాలు నిర్వ‌హించిన స‌మావేశంలో ఈ స‌మ‌స్య ఓ కొలిక్కి వ‌చ్చింది.

సినీ కార్మికుల వేత‌నాల‌ను పెంచేందుకు నిర్మాత‌ల మండ‌లి సూత్ర‌ప్రాయంగా అంగీకారం తెలిపింది. ప్ర‌స్తుతం కార్మికుల‌కు ఇస్తున్న వేత‌నాల‌ను 30 శాతం మేర పెంచేందుకు మండ‌లి అంగీక‌రించింది. దీనిపై గురువారం స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు నిర్మాత‌ల మండలి బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.


More Telugu News