దేవుడు ఓకే చెప్పాడు.... బీజేపీలో చేరాం: గోవా మాజీ సీఎం దిగంబర్ కామత్
- గోవాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ
- బీజేపీలో చేరిన 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- పార్టీ మారిన వారిలో మాజీ సీఎం కామత్, సీఎల్పీ నేత లోబో
- గతంలో ప్రమాణాలు చేసిన కాంగ్రెస్ నేతలు
- తమను ఇప్పుడు దేవుడే వెళ్లమన్నాడన్న కామత్
గోవాలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 11 స్థానాలు లభించడం తెలిసిందే. ఇప్పుడందులో 8 మంది కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతలు, పార్టీకి కట్టుబడి ఉంటామని దేవాలయాల్లోనూ, చర్చిల్లోనూ, మసీదుల్లోనూ ప్రతిజ్ఞ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో చేసిన ఆ ప్రతిజ్ఞలు ఏడు నెలలకే పటాపంచలయ్యాయి. మాజీ సీఎం దిగంబర్ కామత్, సీఎల్పీ నేత మైఖేల్ లోబో తదితరులు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో బీజేపీ కండువాలు కప్పుకున్నారు.
దీనిపై దిగంబర్ కామత్ స్పందించారు. బీజేపీలో చేరేముందు తాను, ఇతర బీజేపీ ఎంపీలు దేవుడి అనుమతి తీసుకున్నామని చెప్పారు. దేవుడు సరే అన్నాడని, తాము బీజేపీలో చేరామని తెలిపారు.
తనకు దేవుడిపై నమ్మకం ఉందని కామత్ వెల్లడించారు. "ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని వీడిపోమని ప్రమాణం చేసిన మాట నిజమే. కానీ దేవుడే పార్టీని వీడి బయటికి వెళ్లేందుకు మార్గం చూపిస్తున్నాడు. నేను మరోసారి ఆలయానికి వెళ్లి, ఏంచేయాలని దేవుడ్ని అడిగాను. నీకు ఏది మంచిది అనిపిస్తే అదే చేయి అని దేవుడు బదులిచ్చాడు" అంటూ కామత్ విలేకరులకు వివరించారు.