'స్వాతిముత్యం' ట్రైలర్ రిలీజ్

  • బెల్లంకొండ గణేశ్ హీరోగా 'స్వాతిముత్యం'
  • దర్శకుడిగా లక్ష్మణ్ కె కృష్ణ పరిచయం 
  • అక్టోబర్ 5వ తేదీన సినిమా రిలీజ్ 
  • అదే రోజున వస్తున్న ' గాడ్ ఫాదర్' .. 'ది ఘోస్ట్'
బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేశ్ 'స్వాతిముత్యం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ సినిమా విడుదలకి ముస్తాబైంది. అయితే సరైన విడుదల తేదీ కోసం వెయిట్ చేస్తూ వస్తోంది. అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు. అప్పటి నుంచి ప్రమోషన్స్ ను మొదలెట్టారు.

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గణేశ్ బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వీడియోను వదిలారు. హీరో హీరోయిన్లకి సంబంధించిన సన్నివేశాలపైనే ఈ వీడియోను కట్ చేశారు. లవ్ .. కామెడీ టచ్ తో ఈ వీడియోను వదిలారు.  సితార బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించాడు.

గణేశ్ జోడీగా వర్ష బొల్లమ్మ నటించింది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి బాణీలను అందించాడు. రావు రమేశ్ .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. త్వరలోనే పూర్తి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఒక వైపున చిరు 'గాడ్ ఫాదర్' .. మరో వైపున నాగ్ 'ది ఘోస్ట్' విడుదలవుతున్న  రోజునే ఈ సినిమా థియేటర్లకు వస్తుండటం విశేషం. 


More Telugu News