అమరావతి అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు
- అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో నిన్న ఐదుగురిని అరెస్ట్ చేసిన సీఐడీ
- ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నారాయణ
- వైద్య చికిత్సల కోసం విదేశాలు వెళ్లాల్సి ఉందన్న మాజీ మంత్రి
- నారాయణకు 3 నెలల పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు
టీడీపీ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని అసైన్డ్ భూముల కుంభకోణంలో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నారాయణకు 3 నెలల పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు బుధవారం కీలక తీర్పు చెప్పింది. ఈ కేసులో మంగళవారమే ఏపీ సీఐడీ పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నారాయణ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు నారాయణకు 3 నెలల పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విచారణ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ విదేశాల్లో చికిత్స తీసుకోవాల్సి ఉందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదే అంశం ఆధారంగా ఇదివరకే ఓ కేసులో హైకోర్టే నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. అయితే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నందున నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేయరాదని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.