ఎయిరిండియా విమానంలో దట్టమైన పొగలు... 14 మందికి అస్వస్థత
- మస్కట్ ఎయిర్ పోర్టులో ఘటన
- విమానం ఇంజిన్ లో మంటలు
- విమానం అంతటా వ్యాపించిన పొగలు
- ప్రయాణికులను దించి వేసిన అధికారులు
మస్కట్ ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. విమానం ఇంజిన్లలో ఒకదాంట్లో మంటలు చెలరేగడంతో విమానం అంతా పొగతో నిండిపోయింది. ఆ సమయంలో విమానంలో 145 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా ఉన్నారు. వెంటనే వారిని విమానం నుంచి కిందికి దింపేశారు.
తోక భాగం వద్ద స్లైడ్ డోర్ (జారుడు బల్ల తరహా ద్వారం) తెరిచి వారిని సురక్షితంగా దించేశారు. వారిని టెర్మినల్ బిల్డింగ్ లోకి తరలించారు. కాగా, ఈ ఘటనలో 14 మంది అస్వస్థతకు గురైనట్టు తెలిసింది.
ఈ విమానం బుధవారం ఉదయం మస్కట్ నుంచి కేరళలోని కొచ్చి రావాల్సి ఉంది. విమానంలో పొగలు రావడంతో, ప్రయాణికులను మరో విమానంలో తరలించే అవకాశాలున్నాయి.