విజయ్ దేవరకొండ దూకుడే 'లైగర్' ను దెబ్బకొట్టింది: వర్మ
- విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కలయికలో లైగర్
- ఇటీవల విడుదల.. బాక్సాఫీసు వద్ద తీవ్ర నిరాశ
- వెల్లువెత్తిన నెగెటివ్ రివ్యూలు
- అందుకు కారణం విజయ్ దేవరకొండేనన్న వర్మ
విడుదలకు ముందే ఎంతో హైప్ తెచ్చుకున్న లైగర్ చిత్రం, విడుదలయ్యాక తేలిపోయింది. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కలయికలో వచ్చిన ఈ సినిమా విడుదల రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా వైఫల్యానికి హీరో విజయ్ దేవరకొండే కారణమని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటున్నారు.
సహజంగానే విజయ్ దేవరకొండ దూకుడు స్వభావం కల వ్యక్తి అని, వేదిక ఎక్కాక అందరి దృష్టిని ఆకర్షించగలిగే చేష్టలు అతడి సొంతమని తెలిపారు. తన ధోరణిలో తాను వేదికపై పొగరుగా మాట్లాడతాడని, అదే లైగర్ ను దెబ్బకొట్టిందని వర్మ విశ్లేషించారు.
"జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లు హిందీ జనాలను సమ్మోహితులను చేశారు. తమ వినయంతో వారు హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోగలిగారు. అప్పటివరకు బాలీవుడ్ తారల అహంకారాన్ని చూసిన వారికి దక్షిణాది నటుల మర్యాదపూర్వక ప్రవర్తన ఓ అద్భుతంలా అనిపించింది. ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ లైగర్ ఈవెంట్లలో తన స్వాభావికమైన పొగరుతో కూడిన ప్రసంగాలు చేసి ప్రేక్షకుల వ్యతిరేకతకు గురయ్యాడు" అని వివరించారు.