ఈ నెల 17న హైదరాబాద్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు: రేవంత్ రెడ్డి
- వేడుకల్లోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్న రేవంత్ రెడ్డి
- తెలంగాణ గీతంతో పాటు రాష్ట్ర పతాకాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడి
- సెప్టెంబర్ 17 నాటి వేడుకలపై రేవంత్ రెడ్డి ప్రకటన
హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనమైన కీలక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఈ నెల (సెప్టెంబర్) 17న హైదరాబాద్ స్వాతంత్య్ర దినం పేరిట వేడుకలు నిర్వహించనున్నట్లుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన చేశారు.
హైదరాబాద్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లోనే తెలంగాణ గీతంతో పాటు రాష్ట్ర పతాకాన్ని కూడా ఆవిష్కరిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని బీజేపీ నిర్వహిస్తుండగా, అధికార టీఆర్ఎస్ తెలంగాణ విలీన దినం పేరిట ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుండగా... తాజాగా హైదరాబాద్ స్వాతంత్య్ర దినోత్సవమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం గమనార్హం.