గోవా సీఎం ప్రమోద్ సావంత్ సమక్షంలో బీజేపీలో చేరిన 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

  • గోవాలో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ
  • పార్టీని వీడిన 8 మంది ఎమ్మెల్యేలు
  • వారిలో మాజీ సీఎం దిగంబర్ కామత్ ఒకరు
  • అదేబాటలో సీఎల్పీ నేత మైఖేల్ లోబో
గోవాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేడు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో వారు కాషాయ కండువాలు కప్పుకున్నారు. 

బీజేపీలో చేరిన వారిలో మాజీ సీఎ దిగంబర్ కామత్, సీఎల్పీ నేత మైఖేల్ లోబో కూడా ఉన్నారు. వారితో పాటే డెలిలా లోబో, రాజేశ్ ఫల్ దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సియో సీక్వియేరా, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

సీఎల్పీ నేత మైఖేల్ లోబో ఇవాళ ఉదయం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేలా తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని లేఖ రూపంలో అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. అనంతరం సీఎం సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ పరిణామంతో ప్రస్తుతం కాంగ్రెస్ కు ముగ్గురు ఎమ్మెల్యేలు మిగిలారు. అటు, గోవా అసెంబ్లీలో బీజేపీ సొంత బలం 20 నుంచి 28కి పెరిగింది.


More Telugu News