'నారాయణ.. నారాయణ' అనడంపై నాగార్జున వివరణ
- బిగ్ బాస్ పై విమర్శలు గుప్పిస్తున్న సీపీఐ నారాయణ
- అదొక బ్రోతల్ హౌస్ అంటూ మండిపాటు
- డబ్బు కోసం నాగార్జున ఇదంతా చేస్తున్నారని విమర్శ
ప్రముఖ సినీ నటుడు నాగార్జున హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ - 6 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు ఈ షోను ముందు నుంచి కూడా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యతిరేకిస్తున్నారు. బిగ్ బాస్ షోను నాగార్జున కనుసన్నల్లో కొనసాగుతున్న ఒక బూతుల స్వర్గంగా ఆయన అభివర్ణించారు. బిగ్ బాస్ ఒక బ్రోతల్ హౌస్ అని, డబ్బు కోసమే నాగార్జున ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.
మరోవైపు గత శనివారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్లతో నాగార్జున మాట్లాడుతూ... భార్యాభర్తలైన మెరీనా, రోహిత్ లను హగ్ చేసుకోమని అడిగారు. వాళ్లు హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ... 'నారాయణ.. నారాయణ... వాళ్లు పెళ్లయిన వాళ్లు' అని కామెంట్ చేశారు. అయితే, సీపీఐ నారాయణను ఉద్దేశించే నాగార్జున ఈ కామెంట్ చేశారని అందరూ భావించారు.
దీనిపై తాజాగా నాగార్జున స్పందిస్తూ... ఎవరైనా జోక్ చేస్తే తాను 'నారాయణ.. నారాయణ' అంటానని చెప్పారు. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ల ఆటను విశ్లేషించుకుంటుంటే తనకు లైఫ్ సైన్స్ లా అనిపిస్తుందని అన్నారు. కుటుంబాన్ని వదిలేసి, వందల కెమెరాల మధ్య, పరిచయం లేని వ్యక్తుల మధ్య అన్ని రోజులు గడపడం చిన్న విషయం కాదని చెప్పారు. ఒక కంటెస్టెంట్ గా బిగ్ బాస్ లోకి తాను వెళ్లాలనుకోవడం లేదని తెలిపారు.