కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీని క్రియాశీలకంగా లేని పార్టీల జాబితాలో చేర్చిన ఎన్నికల సంఘం
- దేశవ్యాప్తంగా అచేతనంగా ఉన్న పార్టీలపై ఈసీ కొరడా
- ఏపీలోనూ 6 పార్టీల తొలగింపు
- క్రియాశీలకంగా లేని పార్టీలతో జాబితా
- కామన్ ఎన్నికల గుర్తు నిలిపివేత
ఎన్నికల్లో పోటీ చేయని, ఉనికిలో లేని అనేక రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించడం తెలిసిందే. ఏపీలోనూ ఆరు పార్టీలను తొలగించింది. అదే సమయంలో ఎన్నికల సంఘం క్రియాశీలకంగా లేని పార్టీలపైనా దృష్టి సారించింది. క్రియాశీలకంగా లేని పార్టీల జాబితాను రూపొందించింది. వాటికి కామన్ సింబల్ ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీని క్రియాశీలకంగా లేని పార్టీల జాబితాలో చేర్చింది. ప్రజాశాంతి పార్టీని కేఏ పాల్ 2008లో రిజిస్టర్ చేయించగా, ఆ పార్టీకి ఎన్నికల సంఘం హెలికాప్టర్ గుర్తు కేటాయించింది.
ప్రజాశాంతి పార్టీ తరఫున 2009 ఎన్నికల్లో 11 మంది పోటీ చేయగా, అందరూ చిత్తుగా ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో కేఏ పాల్ సహా పలువురు పోటీ చేశారు. కేఏ పాల్ నరసాపురం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.