దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఆవిష్కరిస్తున్నాం: ఏపీ మంత్రి మేరుగ నాగార్జున
- స్వరాజ్ మైదాన్ ప్రాజెక్టులో భాగంగా భారీ అంబేద్కర్ విగ్రహం
- హర్యానాలోని స్టూడియోలో విగ్రహ నమూనా
- అధికారులతో వెళ్లి పరిశీలించిన మంత్రి నాగార్జున
- ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని వెల్లడి
దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్రిగహం ఎత్తు 125 అడుగులు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ ప్రాజెక్టులో భాగంగా ఈ విగ్రహ ప్రతిష్ఠాపన జరుపనున్నారు. కాగా, ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, అధికారుల బృందం హర్యానా వెళ్లి అక్కడి స్టూడియోలో ఈ విగ్రహ నమూనాను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఏపీలో ఆవిష్కరిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వరాజ్ మైదాన్ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, విగ్రహ నిర్మాణ పనులను ప్రతిరోజూ సమీక్షించడం జరుగుతోందని వివరించారు. విగ్రహ నిర్మాణ పనుల్లో ఎక్కడా జాప్యం జరుగకుండా అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.