శింబు 'ముత్తు' వాయిదాకి అదే కారణమట!
- శింబు తాజా చిత్రంగా 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'
- దర్శకుడిగా గౌతమ్ మీనన్
- తమిళంలో రేపే విడుదల
- తెలుగులో మాత్రం 17వ తేదీన రిలీజ్
శింబు హీరోగా తమిళంలో గౌతమ్ మీనన్ 'వెందు తణీంధదు కాడు' సినిమా రూపొందించాడు. గణేశ్ నిర్మించిన ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చాడు. బ్రతకడం కోసం పట్నానికి వెళ్లిన ఒక పల్లెటూరి యువకుడు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నాడు? అనేదే కథ. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు.
కానీ రేపు ఈ సినిమా థియేటర్లకు రావడం లేదు. ఎందుకంటే తెలుగు అనువాదానికి సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాలేదట. వారం రోజుల క్రితమే స్రవంతి వారిచేత డీల్ కుదరడం వలన, ఇంత తక్కువ గ్యాపులో డబ్బింగ్ పనులు పూర్తి చేయడం కుదరలేదని టాక్. అందువల్లనే ఈ సినిమాను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేశారు.
శింబు సినిమాను స్రవంతివారు తీసుకోవడానికి కారణం, శింబుతో రామ్ కు మంచి సాన్నిహిత్యం ఉండటమేనని అంటున్నారు. తమిళంలో ఈ సినిమా రేపే విడుదలవుతుంది. తెలుగులో మాత్రం 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' టైటిల్ తో 17వ తేదీన రానుంది. కోలీవుడ్ లో ఈ సినిమాకి మంచి టాక్ వస్తే ఫరవాలేదు .. లేదంటే ఇక్కడి ఓపెనింగ్స్ పై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది.