తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ
- సర్వదర్శనం కోసం 29 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
- శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
- నిన్న స్వామివారిని దర్శించుకున్న 75 వేల మంది భక్తులు
- నిన్న ఒక్కరోజే హుండీ ద్వారా రూ.4 కోట్ల ఆదాయం
ఇటీవల పెళ్లిళ్ల సీజన్ లో భక్తులతో పోటెత్తిన తిరుమలలో ఆ తర్వాత కొన్ని రోజుల పాటు సాధారణ వాతావరణం నెలకొంది. అయితే, తిరుమలకు మళ్లీ భక్తుల తాకిడి పెరిగింది. తిరుమల క్షేత్రం భక్తులతో రద్దీగా కనిపిస్తోంది. సర్వదర్శనం కోసం భక్తులు 29 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
కాగా, నిన్న తిరుమల శ్రీవారిని 75,175 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,979 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.4.05 కోట్ల ఆదాయం లభించింది.
కాగా, నిన్న తిరుమల శ్రీవారిని 75,175 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,979 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.4.05 కోట్ల ఆదాయం లభించింది.