కొన్ని ప్రాంతాలపై సీఎం కేసీఆర్ వివక్ష.. అభివృద్ధి అంతా వారి ప్రాంతాలకే: రేవంత్ రెడ్డి ఆరోపణ
- ఫిరాయింపుల ఎత్తుగడలను మునుగోడు ఉప ఎన్నికతో తిప్పికొడతారన్న రేవంత్
- బీజేపీ, టీఆర్ఎస్ ఎనిమిదేళ్లుగా మోసం చేసి మళ్లీ ప్రజల్లోకి వస్తున్నాయని విమర్శ
- మోదీతో క్షమాపణ చెప్పించేంత వరకు కాంగ్రెస్ పోరాడిందని వెల్లడి
సీఎం కేసీఆర్ తెలంగాణలో కొన్ని ప్రాంతాలపై వివక్ష ప్రదర్శిస్తున్నారని.. కేవలం వారి ప్రాంతాల్లోనే అభివృద్ధి చేసుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే ఆ ప్రాంత ప్రజల కష్టాలు తీరేవని చెప్పారు. బీజేపీ ఫిరాయింపు రాజకీయాలను మునుగోడు ఉప ఎన్నికతో తిప్పి కొడతామన్నారు. ఎనిమిదేళ్లుగా ప్రజలను మోసం చేసిన పార్టీలు.. ఇప్పుడు మళ్లీ మునుగోడు ప్రజల ముందుకు వస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి నేతలు తమ పార్టీల్లోకి ఫిరాయిస్తారని టీఆర్ఎస్, బీజేపీ ఆశించాయని.. కానీ కాంగ్రెస్ ఐక్యత ఆ రెండు పార్టీలకు చెంపపెట్టుగా మారిందని చెప్పారు.
దేశాన్ని పాలించే అర్హత మోదీకి లేదు
ఈ దేశాన్ని పాలించే అర్హత మోదీకి లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకొనేలా చేసి.. మోదీతో క్షమాపణ చెప్పించే వరకు పోరాడిందని వివరించారు. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీలను ప్రశ్నించే గొంతుకకు అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.